మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVG). సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ఒక భారీ ‘ప్రమోషనల్ టూర్’ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, అనంతరం 9:30 గంటలకు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Jai Hanuman:‘జై హనుమాన్’ నుంచి తేజ సజ్జ ఔట్? రూమర్ వెనుక అసలు నిజం ఇదే
ఆ తర్వాత ఉదయం 11 గంటలకు గుంటూరులో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో టీమ్ పాల్గొంటుంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సాంగ్ సాయంత్రం 3 గంటలకు విడుదల కానుంది. చిరంజీవి, వెంకటేష్ (వెంకీ మామ) కాంబినేషన్ కోసం మెగా మరియు నందమూరి అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా సందడి చేయనుంది.
A busy day ahead for the team of #ManaShankaraVaraPrasadGaru💥
Meet the team at:
— Kanakadurgamma Temple
— Press Meet
— Namburu Sankranthi Sambaralu
— #MegaVictoryMass Song Launch at Vignan University 😍#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.… pic.twitter.com/ysG1NigzDd— Gold Box Entertainments (@GoldBoxEnt) December 30, 2025