మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ముందు నుంచి కూడా ప్రతి ఒక్క అప్ డేట్ ను కొత్త గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ గట్టి ప్లానే వేశారు. సినిమా మార్కెటింగ్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు, ఇప్పుడు చిరు సినిమా కోసం ఏకంగా 9 రోజుల్లో 9 వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఈవెంట్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే ఈ ప్రమోషన్స్ జాతర 11వ తేదీ వరకు నాన్-స్టాప్‌గా సాగనుంది. రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపూర్, వరంగల్, చివరగా బెంగళూరులో ఈ హంగామా ఉండబోతోంది.
Also Read : Sri Vishnu: వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు..
ఇక ప్రమోషన్స్ విషయంలో వస్తున్న రూమర్స్‌కు కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. చిరంజీవి గారు ప్రమోషన్స్‌కు రారు అనే మాటలో అస్సలు నిజం లేదని, ఆయన అన్ని ప్రధాన ఈవెంట్లలో పాల్గొంటారని స్పష్టం చేశారు. అంతేకాదు, సాధారణంగా సినిమా ఈవెంట్లకు రాని ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార కూడా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం స్పెషల్‌గా రాబోతుండటం విశేషం. మెగాస్టార్, నయన్ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
THE MEGA COUNTDOWN BEGINS TODAY 🔥
9 DAYS – 9 LOCATIONS – 9 ACTIVITIES 😎💥
All leading up to the grand arrival of Megastar @KChiruTweets garu as #ManaShankaraVaraPrasadGaru 💥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026. #Chiranjeevi #MSGonJan12th pic.twitter.com/KicYJUJFOJ
— Team Megastar (@MegaStaroffl) January 3, 2026