Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇదివరకే తెలుసు.
READ ALSO: Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… మేకర్స్ త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారిక అప్డేట్ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారట. జనవరి 12, 2026న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా, విక్టరీ వెంకటేష్ ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి పండుగ సందర్భంగా రాబోతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ కోసం రేపు ఒక స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్.
READ ALSO: Dhurandhar: “ధురందర్” సినిమాలో పాత్రలు నిజ జీవితంలో ఎవరితో సరిపోలుతున్నాయి..?