Chiranjeevi : దటీజ్ చిరు.. ఆయనకు అభిమానులంటే ఎంత గౌరవమో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా ప్రస్తుతం విశ్వంభర అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్.. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే మెగా స్టార్ కు పలు అరుదైన గౌరవాలు దక్కాయి. మొదటిగా దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవిని వరించగా మొన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా మెగాస్టార్ కైవసం చేసుకుని టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించారు.
Read Also:DSC Results 2024: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) – 2024 అవార్డ్స్ లో కూడా మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మరో స్పెషల్ అవార్డుని గెలుచుకున్నారు. అబుదాబిలో జరుగుతున్న ఈ వేడుకలకు చిరంజీవి హాజరై ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిరు ఆ అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ మెగా అభిమానులని మరింత ఆనందంలో ముంచేశాయి. తనకి తన అభిమానులని మించిన అవార్డు ఇంకొకటి లేదన్నారు. వారి తర్వాతే మిగతా అవార్డులు అనే రీతిలో తన అభిమానులకి తన గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో చెప్పకనే చెప్పారు. దీనితో చిరు విషయంలో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Israeli Strike: బీరుట్‌లో ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. నలుగురు మృతి
ఐఫా 2024 పురస్కారాల్లో మరో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గోల్డెన్ లెగసీ పురస్కారాన్ని, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా, హీరోయిన్ సమంత ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాల్ని అందుకున్నారు. ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. తెలుగు నుంచి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ కలిసి సందడి చేయడం వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!