DSC Results 2024: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
- తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి..
- ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా.. డీఎస్సీ మార్కులతో పాటు టెట్ మార్కులను కూడా ఈ ర్యాంక్ జాబితాలో చేర్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా సాధారణ ర్యాంకు జాబితాను విడుదల చేస్తారు. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత డీఈవోల ఆధ్వర్యంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలు జారీ చేయబడతాయి. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.
Telangana DSC Results 2024 Link: https://tgdsc.aptonline.in/tgdsc/
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ఈ ఏడాది మార్చి 1న 11062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించగా.. కొత్త ప్రభుత్వం పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈసారి ప్రభుత్వం తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించింది. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 13న రాష్ట్ర విద్యాశాఖ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదలైంది. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పరీక్షల్లో భర్తీ చేస్తారు.
England vs Australia: ఇంగ్లాండ్ కొంప ముంచిన వరణుడు.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!