Chintakayala Vijay: అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. హైదరాబాదులో మా ఇంటి పైకి సీఐడీ అధికారులు వచ్చారు.చిన్న పిల్లలను కూడా బెదిరించారు.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు వచ్చానన్నారు. నన్ను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పింది.వాళ్ల విచారణకు సహకరించాలని వచ్చాను. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో రాలేదు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చాను.
బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది. సెంటు భూమి కోసం మా ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారు. అక్రమ కేసులతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారు.ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.అయ్యన్నపాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోంది.సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారు.తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో ఇదంతా జరుగుతోంది.ఇలా సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలి.భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది.అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కొడాలి, పేర్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిలు ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కున్నారు.ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరు.
Also Read
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
Read Also: Hansika: అరుదైన ప్రయోగంలో హన్సిక ప్రధాన పాత్ర…
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతుంది.అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ చేయాలని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.కానీ ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నారు. కోటేశ్వరరావు, చింతకాయల విజయ్ న్యాయవాది.భారతీ పే యాప్ వ్యవహారంలో విజయ్‌పై కేసు పెట్టారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు చెప్పింది. సీఐడీ అధికారులు చాలా రకాల వస్తువులు తీసుకుని రమ్మన్నారన్నారు.
Read Also: Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..