సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ‘105 మినిట్స్’ అనే టైటిల్ తో ‘హన్సిక’ ఒక సినిమా చేస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక, ‘105 మినిట్స్’ సినిమా చేస్తుంది అనగానే హన్సిక అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. రాజు దుస్సా డైరెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ రూపొందిన సినిమాగా చరిత్రకెక్కింది.
Read Also:Cm Jagan Vinukonda Public Meeting Live: వినుకొండలో జగన్ బహిరంగ సభ లైవ్ అప్ డేట్స్
‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ అనే టైటిల్ కి తగ్గట్లే సరిగ్గా ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే థ్రిల్లర్ ని సింగిల్ షాట్ లో ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాలు సింగిల్ షాట్ టెక్నాలజీతో రూపొందాయి. ఇదే తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా కావడం విశేషం.
రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండడం ఈ 105 మినిట్స్ సినిమా స్పెషాలిటి. దీని కారణంగా ఆడియన్స్ కి ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని, ఇలాంటి ప్రయోగం అందరికీ కనెక్ట్ అయితే మంచి హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యనున్నారు.