చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య.. అయితే, బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్.. దీంతో.. మణీందర్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేది.
అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది.