సిద్దార్థ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….సిద్దార్థ్ కు తెలుగు లో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది..తెలుగులో సిద్దార్థ్ బాయ్స్,నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కానీ ఆ తరువాత తెలుగులో చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో సిద్దార్థ్ తమిళ్ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయాడు.. అక్కడ వరుస సినిమా చేస్తూ బిజీ గా మారాడు..కొన్నాళ్ళుగా సిద్దార్థ్ సరైన హిట్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు..చాన్నాళ్లకు తెలుగులో సిద్దార్థ్ మహాసముద్రం అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. అయితే సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ సినిమాలో నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. సేతుపతి సినిమా ఫేమ్ అరుణ్ కుమార్దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను చిన్నా అనే పేరుతో తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా సిద్దూ కెరీర్‌లోనే ఇది బెస్ట్ సినిమా అని విమర్శకులు కూడా ప్రశంసించారు . ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లో విడుదల కాబోతుంది..ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ మరియు ఈటాకీ ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఈ సినిమా కథ విషయానికి వస్తే.ఈ చిత్ర కథ ఓ చిన్నారికి తన బాబాయ్ చుట్టూ నడుస్తుంది..సడన్‌గా తన కూతురు కిడ్నాప్ అవ్వగా.. కూతురు కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ఈ కిడ్నాప్ అస్సలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..