Child Kidnap: తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్ తో కిడ్నాప్ చేసారు గ్యాంగ్. ఈ ఘటనలో పక్కా ప్రొఫెషనల్లా వ్యవహరించారు నలుగురు మహిళా కిడ్నాపర్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను గమనించినట్లైతే..
Read Also: Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
మొదట బురఖ వేసుకుని వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ తర్వాత బురఖా మార్చి వేసుకున్నారు గ్యాంగ్ మహిళలు. కిడ్నాప్ తర్వాత నంబర్ ప్లేట్ లేని ఓ స్కూటీపై ఇద్దరు మహిళలు చిన్నారిని అపహరించారు. ఆ తర్వాత మిగిలిన మరో ఇద్దరు మహిళలు ఆటోలో వెళ్లిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. చూడాలి మరి పోలీసులు కేసును ఎంత త్వరగా చేదిస్తారో.
Read Also: Nagarjuna – Konda Surekha: పరువునష్టం పిటీషన్ పై నేడు కొనసాగనున్న విచారణ