Andhrapradesh: గుడ్డు తిని చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: గుడ్డు తిని చిన్నారి మృతి చెందడంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన మానవ హక్కుల సంఘం బాధిత కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్, అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలపై అధికారులు హైకోర్టుకు వెళ్లడంతో మానవహక్కుల సంఘం నిర్ణయం సరైనదేనని సమర్థించింది. అంగన్‌వాడీ కేంద్రంలో.. కుళ్లిన కోడిగుడ్డు తిని ఓ చిన్నారి మృతి చెందిన కేసులో.. మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది.
Read Also: Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
అసలేం జరిగిందంటే.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరిల కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న ఓ చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసింది. కుళ్లిన కోడిగుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఉదయం పిల్లలకు టీచర్ కోడిగుడ్లు ఇచ్చారు. కాసేపటికే దీక్ష అనే చిన్నారి వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పాప మరణించినట్లు వెద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై అంగన్‌వాడీ టీచర్‌ను వివరణ కోరగా…తాము సరఫరా చేసిన గుడ్లు బాగానే ఉన్నాయన్నారు. ఈ ఘటన గురించి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్‌ఆర్‌సీ(మానవ హక్కుల సంఘం) విచారణ జరిపింది. చిన్నారి తల్లిదండ్రులు సరిత, మురేగేష్‌లకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఆ సొమ్మును చెల్లించాలని అంగన్‌వాడీ టీచర్, కుప్పం తహసీల్దార్, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్ తదితరులను ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు.. పరిహారం విధించడం సరైనదే అని పిటిషన్‌ను కొట్టివేసింది.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..