హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. గన్ కి సంబందించిన డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అని చీకోటి ప్రవీణ్ వెల్లడించారు. ఛత్రినాక పోలీసులకు గన్ అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అయితే.. లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం మాత్రమే వచ్చానని…ఆలయం లోపలికి గన్స్ తో వెళ్ళలేదని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు.
Also Read : Pilli Subhash Chandra Bose: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు
తనకు ప్రాణహాని ఉన్న కారణంగానే బారీకేడ్స్ వరకు సెక్యూరిటీతో వెళ్లానని తెలిపారు. అన్ని అనుమతిలతో గన్స్ సెక్యురిటీ ఏర్పాటు చేసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. తాను హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలు పోలీసులకు ఇస్తానన్నారు.త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలియడంతో కొందరు తనపై కక్ష కట్టారని ప్రవీణ్ ఆరోపించారు.
Also Read : World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!