Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
- తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..
- దీపం వెలిగించాలనే సుప్రీం ఆదేశాలను పాటించాల్సిందే..
- హైకోర్టు ఆదేశాలతో విజయ్ సర్కార్‌కు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruparankundram: తమిళనాడులో తిరుప్పరంకుండ్రం ‘‘కార్తీక దీపం’’ వివాదం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు కొండపై ఉన్న దీపతూన్(దీపస్తంభం)పై దీపాన్ని వెలిగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, దీప స్తంభానికి దగ్గరగా దర్గా ఉండటంతో దీపానికి అనుమతి ఇస్తే అతది మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందని, శాంతిభద్రతల్ని ప్రభావితం చేస్తుందని అధికారంలో ఉన్న విజయ్ సర్కార్ వాదిస్తోంది.
దీపం వెలిగించాల్సిందే.. ఆదేశాలు అమలు చేయాల్సిందే..
ఇదిలా ఉంటే, దీపం వెలిగించకుండా అడ్డుకోవాలని చూడటాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానాల ఆదేశాలను విమర్శించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని, విమర్శ ఎంత తీవ్రంగా ఉన్నా అభ్యంతరం లేదని, కానీ ఆదేశాలను ధిక్కరించాలని లేదా వాటిని అమలును అడ్డుకోవాలని పిలుపునివ్వకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
Also Read
- Rahul Gandhi: "నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు": రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
- UP Elections: రాయ్‌బరేలీలో సున్నా.. అమేథీలో ఒక్కటే! కాంగ్రెస్‌కు ఎస్పీ షాక్
- Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వనందున, జిల్లా, పోలీసు, ఆలయ అధికారులు తప్పనిసరిగా నవంబర్ 20 నాటి తీర్పును అమలు చేయాల్సిందేనని పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 144 ప్రకారం మదురై కలెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలకు సహకరించాలని, ఇతర అధికారుల నుంచి ఎలాంటి భిన్నమైన సలహాలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆంక్షలు.. భక్తుల పిటిషన్లు..
ఆలయం, మసీదు రెండు కూడా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్నాయి. దీంతోనే వివాదం నెలకొంది. దీంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షల్ని సవాల్ చేస్తూ ‘‘గిరి ప్రదర్శన’’ చేస్తున్నవారిని అనుమతించాలని మలై రాజా, జే జాస్వంత్ అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా మదురై కలెక్టర్ స్వయంగా హాజరు కావాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించడంతో కలెక్టర్ విచారణకు హాజరయ్యారు.
కలెక్టర్ జారీ చేసిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా గిరివలం చేసే భక్తులను అడ్డుకోవద్దని, ఈ ఆంక్షల కింద అక్రమంగా ఎవరినైనా నిర్బంధించి ఉంటే వారిని తక్షణమే విడుదల చేయాలని పోలీసులకు సూచించింది. ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణ్ స్పందిస్తూ.. ఆలయంలో వేలాది మంది భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే 250 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Suryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!