Nagarjuna King 100: నో పోస్ట్‌పోన్.. అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna King 100: అక్కినేని అభిమానులను గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్న వాయిదా పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) అనుకున్న సమయానికి రాకపోవచ్చని, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం తాజాగా తేల్చిచెప్పింది. ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్నామంటూ మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు.
డిసెంబర్ 24, 2026న ‘కింగ్ 100’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. రిలీజ్‌కు సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే ఉందంటూ మేకర్స్ తాజాగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక్క పోస్టర్‌తో ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేయడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కౌంట్‌డౌన్ మొదలవడంతో ఇక ప్రమోషన్ల జోరు కూడా పెరగనుంది.
Also Read
- Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
- Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
- Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
- Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
దర్శకుడు రా.కార్తీక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఎవర్గ్రీన్ బ్యూటీ టబు నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వీరితో పాటు అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, సుశాంత్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
30 DAYS for the KING to REIGN SUPREME ON THE BIG SCREENS 👑🔥
#King100 𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔 ❤🔥
King @iamnagarjuna #Tabu @ThisIsDSP
@AshokSelvan @Rakarthik_dir @ravindravijay1 @aishu_dil
@sush_bhat94 @rajamahadhevan @NavinNooli @ArtSathees
@CVRao74 @lemonsprasad
#SupriyaYarlagadda @TSeriesSouth @AnnapurnaStdios— Annapurna Studios (@AnnapurnaStdios) November 24, 2026
తాజావార్తలు
-
Nagarjuna King 100: నో పోస్ట్‌పోన్.. అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
-
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!