Godavari: గోదావరి నదికి సీఎం కేసీఆర్ ప్రత్యేక హారతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari River: ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో రెండు జిల్లాల సరిహద్దు గోదావరి నది చేరుకున్న అనంతరం కొద్ది సేపు ఆగి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు.
Read Also:CM KCR Speech: ధరణి పోతే దళారీ రాజ్యం.. అదంతా దాని వల్లే..
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
అనంతరం నదిలో నాణాలను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సుందిల్ల బ్యారేజ్ సమీపంలోనే గోదావరి వంతెన ఉండటం ఏడాది పొడుగున నీటి నిల్వ ఉంటుంది. దీంతో నది ప్రవాహానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి ప్రత్యేక హారతి నిర్వహించారు. ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు నియోజక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా.. మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.1000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4116 పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3,116 పింఛన్ వస్తోంది. దీంతో సభకు వచ్చిన ప్రజలు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారన్న ముఖ్యమంత్రి… జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్న ముఖ్యమంత్రి… ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!