Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే.. బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై యుద్ధం కొనసాగుతుండగా.. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..
ఈ వ్యవహారంలో వైసీపీ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, తెలంగాణ, ఏపీలో డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇటువంటి ఫిర్యాదులపై విచారణ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల నిబంధనలు, నియమావళిని పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.