Chicken prices: నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. ముక్క కొనేదెలా..? ముద్ద దిగేదెలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken prices: నాన్‌వెజ్ ప్రియులకు షాక్ తగిలినంత పని అవుతోంది.. మటన్ ధరలో పాటు చికెన్ ధర కొండెక్కుతోంది.. అసలే కరోనా తర్వాత ఎగ్స్, మటన్, చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది.. అది ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే, వేసవి దెబ్బకు చికెన్ ధర పైపైకి కదులుతోంది.. ముక్కలేనిదే ముద్ద దిగని వారు ఎంతో మంది తయారయ్యారు.. వారం మొత్తం సంగతి ఎలా ఉన్నా.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఎదో ఒక నాన్‌వెజ్ ఇంట్లో ఉండాల్సిందే.. లేదా.. నచ్చిన హోటల్ నుంచి మెచ్చిన ఫుడ్ అయినా తెచ్చుకోవాలి.. లేదా ఆర్డర్ పెట్టాలి.. కానీ, నాన్‌వెజ్ ధరలు ఇప్పుడు వంటింటికి భారంగా మారుతున్నాయి.
Read Also: Lord Hanuman: “హనుమంతుడు ఆదివాసీ”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
కిలో మటన్ ధర రూ.800కి పైగానే పలుకుతుండగా.. కిలో చికెన్ ఏకంగా 300 రూపాయాలను క్రాస్ చేసి.. రూ.350కి చేరింది.. దీంతో మాసం తినేందుకు సామాన్య ప్రజలు జంకే పరిస్థితి వచ్చింది.. వారం మొత్తం ఎలా ఉన్నా సరే.. ఆదివారం వచ్చిందంటే నీచు ఉండాల్సిందే అనేవారు కూడా.. కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారట.. నాన్‌వెజ్ తినాలంటే పావు కేజీతోనో, అర కేజీతోనే సరిపెట్టుకుంటున్నారట. అయితే, ప్రతీ ఏడాది ఎండలు పెరిగాయంటే.. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ ఏడాది కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో.. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.200 నుంచి 250 మధ్య పలికింది.. ఇప్పుడు ఎండలు దంచికొట్టె భరణి కార్తె, రోహిణి కార్తె పోయి.. మృగశిర కార్తె వచ్చినా.. ఎండలు మాత్రం తగ్గడం లేదు.. దీంతో.. కొన్ని రోజుల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్నంటాయి.. కిలో చికెన్ రూ.300 దాటి.. ఆ తర్వాత రూ.350కు చేరింది.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో, విజయవాడలో కిలో చికెన్ ధర రూ.350గా ఉంది.. ఇక, బోన్ లెస్ చికెన్ అయితే రూ.700లకు చేరగా.. లైవ్ బర్డ్ ధర రూ.166 పలుకుతోందని చెబుతున్నారు.. ఓవైపు ఎండల తీవ్రతతో కోళ్లు మృత్యువాత పడడం ధరల పెరుగుదలకు ఒక కారణం అయితే.. మరోవైపు పెళ్లిల్ల సీజన్ తో చికెన్‌కు డిమాండ్ పెరగడం కూడా మరో కారణంగా చెబుతున్నారు వ్యాపారులు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!