ఛతేశ్వర్ పుజారా..టీమిండియా టెస్టు జట్టులో ఓ అసాధారణ ప్లేయర్. సుదీర్ఘ ఫార్మాట్‌లో మిస్టర్ వాల్ రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన రికార్డులూ ఖతాలో వేసుకున్నాడు. 13 ఏళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ప్రధాన ప్లేయర్‌గా కొనసాగుతున్న పుజారా ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ప్రతి క్రికెటర్ కలలు కనే 100వ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. కెరీర్‌లో చాలా కొద్ది మందికే దక్కే ఈ అరుదైన అవకాశం పుజారా వశమవ్వబోతుంది.
Also Read: Lexi: ఇండియా మొట్టమొదటి చాట్‌బాట్ ‘లెక్సీ’..బెనిఫిట్స్ ఇవే!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం (ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కాబోతున్న రెండో టెస్టు పుజారాకు కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. తద్వారా ఈ ఘనత సాధించనున్న 13వ ఇండియన్ క్రికెటర్‌గా పుజారా నిలవనున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న టీమ్‌లో విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ గా పుజారా నిలుస్తాడు. విరాట్ గతేడాది మార్చిలో శ్రీలంకతో తన వందో టెస్టు ఆడాడు. పుజారా తన కెరీర్లో భారీగా పరుగులు సాధించిన ఆస్ట్రేలియాపైనే ఇప్పుడీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుండటం మరో విశేషం.
Also Read: Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్
2010లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన టెస్టులోనే పుజారా అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టీమ్‌పై 100వ టెస్టు ఆడబోతున్నాడు. తన తొలి మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌ను కాదని పుజారాను మూడోస్థానంలో పంపగా.. అతడు 72 రన్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్ గెలిచిన ఇండియా సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాపై అతడు 21 టెస్టులు ఆడాడు. అందులో 52.77 సగటుతో 1900 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Telangana Shakunthala: ఏ పోరి నోట్ల కానీ ఏ పోరడి నోట్ల గానీ పేమ అని వినపడాలి..నరుకుతా దీంతల్లి