Telangana Shakunthala: నేడు ప్రేమికుల రోజు అన్న విషయం తెల్సిందే. తమ ప్రేమను ప్రేమించినవారికి తెలిపేరోజు. ఇక ఈ కాలంలో పురాతన కాలంలో చూపించిన విధంగా అమరప్రేమలు లేవు. వాలెంటెన్స్ డేకు ఎవరు ఎన్ని గిఫ్టులు ఇచ్చారు.. అబ్బాయి సంపాదన ఏంటి.. అమ్మాయి అందంగా ఉందా.. కొన్ని రోజులు టైమ్ పాస్. ఇంకొంతమంది.. అమెరికా సంబంధం వచ్చింది.. డబ్బున్న వాడు దొరికాడు.. వేరే అమ్మాయి నచ్చింది అంటూ ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకుంటున్నారు తప్ప నిజమైన ప్రేమ అనేది ఎక్కడా అకనిపించడం లేదు. మరి ముఖ్యంగా చిన్న వయస్సులోనే ప్రేమ అనే పేరుతో కొంతమంది యువతీయువకులు చేసే పనులు తల్చుకొంటే ఒళ్లు జలదరించక మానదు. ఇకపోతే.. ప్రేమికుల రోజు వచ్చిందంటే..ప్రేమికులు ఎలా అయితే ప్రేమ కొటేషన్స్, ప్రేమ డైలాగ్ లు చెప్తారో.. సింగిల్స్ మరియు బ్రేకప్ అయినవారు కూడా ఒక డైలాగ్ కొడుతూ ఉంటారు. అదే నువ్వు నేను సినిమాలో తెలంగాణ శకుంతల చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్.
Naveen Chandra: లవర్స్ డే.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో
“ఇయ్యాల రేపు ఎవర్ని చూసినా ప్రేమా.. ఇదో సోకైపోయింది. ఏందే ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలేం మేమంతా పెరుగుతలేం. ఇంకోపారి నా ఇలాకలో ఏ పోరి నోట్ల కానీ ఏ పోరడి నోట్ల గానీ పేమ అనే మాట నాకినబడాలే.. గొడ్డలి తీసుకొని తుక్డాలు తుక్డాల కింద నరుకుత దీం తల్లి” అంటూ ఎంతో కసితో ఆమె ఈ డైలాగ్ చెప్తుంది. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఇప్పటికీ ఈ డైలాగ్ ఇంకా హిట్ అవుతూనే ఉంది. ఈ డైలాగ్ ఇప్పుడు తరానికి వార్నింగ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ డైలాగ్ ద్వారా చనిపోయిన తెలంగాణ శకుంతలను మరోసారి గుర్తుచేసుకున్నట్లు కూడా అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. కమెడియన్ గా, లేడీ విలన్ గా ఆమె నటన అద్భుతం. మరి మీరు కూడా సింగిల్స్ అయితే.. ఇదే డైలాగ్ ను స్టేటస్ పెట్టి మీ కమిటెడ్ ఫ్రెండ్స్ కు వార్నింగ్ ఇచ్చేయండి.