Case Filed on Sundhara Travels Actress Radha: కోలీవుడ్ నటి రాధపై కేసు నమోదైంది. తన కుమారుడు ఫ్రాన్సిన్ రిజర్డ్‌పై రాధ దాడి చేసిందని డేవిడ్ రాజ్ అనే వ్యక్తి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. రాధ గతంలో కూడా పలు వివాధాల కారణంగా కోలివుడ్ మీడియాలో వార్తల్లో నిలిచారు.
నెల్లూరుకు చెందిన రాధ నటనపై ఉన్న ఇష్టంతో చెన్నై మకాం మార్చారు. సుందరాట్రావెల్స్, అదావతి, మనస్థాన్, కధవరాయన్ లాంటి పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. రాధకు కుమారుడు తరుణ్ ఉన్నాడు. వీరిద్దరూ సాలిగ్రామంలోని లోకయ వీధిలో నివసిస్తున్నారు. వీరి ఇంటి సమీపంలోనే డేవిడ్ రాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి కుమారుడు ఫ్రాన్సిస్ రిచర్డ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
Also Read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు!
ఫ్రాన్సిస్ రిచర్డ్ మార్చి 14న రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటి సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడిని నటి రాధ, ఆమె కుమారుడు తరుణ్ వెంబడించారు. ఇంటికి సమీపంలోనే రిచర్డ్‌పై రాధ, తరుణ్ కలిసి దాడి చేశారు. దీంతో రిజర్డ్ తండ్రి డేవిడ్ రాజ్.. నటి రాధ, ఆమె కొడుకు తరుణ్‌పై విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత డిసెంబర్‌లో రిచర్డ్ తనను వేధించాడని రాధ విరుగంబాక్కమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రిచర్డ్‌పై రాధ దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.