Chennai: వైరల్ వీడియోలో పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు..
- పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు
- మెరీనా బీచ్‌లో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను తిట్టిన దంపతులు
- డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు ఫోన్ చేస్తానని బెదిరింపులు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మెరీనా బీచ్‌లోని లూప్ రోడ్‌లో జరిగింది. అక్కడ రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. చంద్రమోహన్, ధనలక్ష్మి అనే దంపతులను ప్రశ్నించారు.
Read Also: No Romance in Cab: క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్
Also Read
పోలీసులు వారిని విచారించగా తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యమేంటంటే.. దంపతులు పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో.. పోలీసులు వారు తిడుతున్న ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో, ఆ దంపతులు కెమెరాకు పోజులిచ్చి.. పోలీసులను కించపరిచే పేర్లతో బూతులు తిట్టారు. అంతేకాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక పోలీసును “బల్లిలా కనిపిస్తున్నారు” అని కూడా దుయ్యబట్టారు. భర్త చంద్రమోహన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వాదించాడు. “నేను ఉదయనిధి స్టాలిన్‌ని పిలవనా? నన్ను చూస్తే మీ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పారిపోతాడు.” మరుసటి రోజే మీ చిరునామాలను ట్రాక్ చేస్తానని బెదిరించాడు, తనను అరెస్టు చేయలేరని చెప్పాడు.
Read Also: Maharashtra: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టు మృతి
వారు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ.. చంద్రమోహన్ అధికారులను ఎగతాళి చేస్తూ.. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదన్నాడు. కాగా.. ఈ దంపతులు చేసిన హంగామా.. అసభ్య పదజాలం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవంగా ప్రవర్తించిన దంపతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులను కనిపెట్టారు. చంద్రమోహన్, ధనలక్ష్మిలను వెలచ్చేరిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మైలాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!