Harirama Jogaiah: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఓ లేఖ హల్ చల్ చేస్తోంది.. దాని ప్రకారం.. పవన్ నిర్ణయాన్ని జోగయ్య తప్పుబట్టారు.. అంతేకాదు.. ప్యాకేజీ ఆరోపణలు నిజమే అనిపిస్తుందంటూ.. ఆ లేఖలో రాసుకొచ్చారు.. నిజం నిద్రలేచే సరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్నట్టుగా.. ఆ ప్రకటన నేను చేయలేదు.. అది ఫేక్ అంటూ తాజాగా మరో లేఖను విడుదల చేయాల్సి వచ్చింది.
Read Also: Madhyapradesh : ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. అడవిలోకి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం
మాజీమంత్రి హరిరామ జోగ్యయ్య పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ హల్ చల్ చేస్తోంది. కాపు సామాజికవర్గానికి పవన్ కల్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాం.. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి అంటూ ఆలేఖ సారాంశంగా ఉంది.. అయితే, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖ తన నుంచి వచ్చింది కాదని మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేస్తూ మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు ‘కాపు సామాజిక వర్గానికి ఒకవిన్నపం’ అంటూ నా పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య.. దీన్ని జనసైనికులు గమనించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమైన గమనిక అంటూ లేఖ విడుదల చేశారు.. చీప్ ట్రిక్స్ కి పాల్పడుతూ వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కల్యాణ్ సీఎం పీఠం అధిష్టించేవరకు అంతా ఆయన వెంట ఉండాలని లేఖలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు.
హరిరామ జోగయ్య విడుదల చేసిన లెటర్

హరిరామ జోగయ్య పేరుతో ఫేక్ లెటర్
