చీప్ ట్రిక్స్ కి పాల్పడుతూ వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కల్యాణ్ సీఎం పీఠం అధిష్టించేవరకు అంతా ఆయన వెంట ఉండాలని లేఖలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు..…