యసస్వి కొండెపుడి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఓవర్ నైట్‌లో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. ఆ సీజన్ సరిగమప విన్నర్‌గా కూడా టైటిల్‌ను గెలుకున్నాడు. అయితే.. ఈ ఫేంతోనే పలు మార్లు టీవీ షోల్లో మెరిసిన యసస్వి.. ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నట్లు 50 నుంచి 60 మంది పిల్లలను అక్కున చేర్చుకొని సాకుతున్నట్లు వెల్లడించారు. అయితే.. ఇది నిజాం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్ లో ప్రచారం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నవ సేవ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థలు స్థాపించి 56 మంది అనాధ పిల్లలను తాము సాకుతున్నామని అన్నారు.
Also Read : Revanth Reddy : తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
ఇటీవల ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పాటలు పాడిన యసస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు తద్వారా సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను నేరుగా యసస్విని సంప్రదించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరిన స్పందించలేదని అన్నారు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్ పై, యసస్విపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.
Also Read : Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…