భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆదివారం ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.