Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీపై తన మనసులో మాటలు చెప్పి.. చాలాసార్లు నాని వివాదాస్పదంగా మారాడు. టికెట్ రేట్ల సమయంలో నాని అన్న మాటలు ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికి తెల్సిందే. ఇంకా ఈ వివాదం ముగియకముందే.. ఈ మధ్యనే కింగ్ ఆఫ్ కోతా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీంతో అభిమానులు టాలీవుడ్ లో పాన్ ఐడియా స్టార్లు లేరా.. తెలుగు హీరోలను నాని అవమానించాడని పలువురు ఆయనపై విమర్శలు చేశారు. ఇక తాజాగా నాని.. నేషనల్ అవార్డ్స్ వచ్చినవారికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. కోలీవుడ్ లో అవార్డుకు నోచుకోలేని ఒక సినిమా గురించి బాధను వ్యక్తం చేశాడు. నేషనల్ అవార్డ్స్ వచ్చిన వారందరిని నాని అభినందించాడు.
Suman: పవన్ కి సీనియర్ హీరో మద్దతు.. 3 కాకపోతే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు అంటూ!
ఇక ఈ నేషనల్ అవార్డ్స్ వచ్చిన దగ్గరనుంచి కోలీవుడ్ లో రభస మొదలయ్యింది. కొన్ని సినిమాలను ప్రభుత్వం గుర్తించలేదని వాపోయింది. అందులో జై భీమ్ ఒకటి. జస్టిస్ కె. చంద్రు నిజజీవిత కథ ఆధారంగా 2021లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సూర్య ఈ సినిమాలో జస్టిస్ కె. చంద్రు గా కనిపించాడు. భర్తకోసం ఒక గిరిజన మహిళ పడే వేదన..అధికారం, డబ్బు ఉన్న పెద్దకులం వారు.. తక్కువ కులంవారిని ఎలా అణిచివేస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమా అవార్డు అందుకొనే అన్ని అర్హతలు ఉన్న సినిమా. కానీ, సినిమాకు మాత్రం అవార్డు రాలేదు. దీంతో అభిమానులు అలా ఎలా ఈ సినిమాను మిస్ చేశారు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇక ఈ విషయమై నాని కూడా స్పందించాడు. ” జై భీమ్” అని పోస్ట్ చేస్తూ పక్కన మనసు ముక్కలు అయ్యిందన్న ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గామారింది. ఒక మంచి సినిమా అవార్డును అందుకోలేకపోయిందనే భాధను నాని చూపించాడు. దీంతో నానికి అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.