Chandrababu: మూడోసారి ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్‌లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. విషపూరిత మద్యం కారణంగా 31వేల మంది మరణించారని ఆయన తెలిపారు. గురువారం రాత్రి విశాఖ సీతంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఐటీ, టూరిజం డెస్టినేషన్‌గా వుండాలి కానీ.. నగరానికి డ్రగ్స్, గంజాయి వస్తోందన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపి బటన్‌లు నొక్కుతానని మోసం చేశారని.. తన జీవితంలో ఎప్పుడూ నేరపూరిత ఆలోచనలు చేయలేదన్నారు. రాజకీయ రౌడీలను ఉపేక్షించేది లేదన్నారు. మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నారు.
Read Also: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
Also Read
జైల్లో తనను లేపేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని చంద్రబాబు అన్నారు. చాలా ప్రయత్నాల ద్వారా తనను ఇబ్బంది పెట్టారన్నారు. మూడో సారి ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీనే అని ఆయన చెప్పారు. కేంద్రం ఆలోచన వికసిత్ భారత్ అయితే మా విధానం వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు తెలిపారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగ విధానం అమలు చేస్తామని.. ఐటీ టవర్ నిర్మాణం చేసి వర్క్ కల్చర్ విస్తృతం చేస్తామన్నారు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు…..ఇంట్లో వున్న బామ్మ సరిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బటన్‌ల ద్వారా నొక్కింది ఎంత బొక్కింది ఎంత సీఎం చెప్పాలన్నారు. ప్రజల ఆస్తులను వాళ్లకు అప్పగిస్తామని చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?