CM Chandrababu: రేపటి ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రేపటి ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి..!అమరావతిలో సాంకేతిక రంగం సంబంధించి మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వదేశీ తయారీ క్వాంటం కంప్యూటర్ దేశానికి గర్వకారణమని, అమరావతి క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాకుండా దేశానికీ ప్రతిష్ఠను తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.
Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్‌లో 1Q పేరిట మరో క్వాంటం సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ క్వాంటం ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలక వేదికలుగా నిలవనున్నాయి. పరిశోధకులు, విద్యార్థులు, కంపెనీలు క్వాంటం టెక్నాలజీని వినియోగించుకునేలా వీటి ద్వారా అవకాశాలు విస్తరించనున్నాయి. క్వాంటం సైన్స్‌కు వందేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రపంచ క్వాంటం దినోత్సవం రోజున ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం గర్వకారణమని సీఎం అన్నారు.
టెక్నాలజీని అర్థం చేసుకుని ప్రోత్సహించే నాయకత్వం దేశానికి అవసరమని, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశానికి అదృష్టమని వ్యాఖ్యానించారు. అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాండికర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ క్వాంటం ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చడం విశేషమని పేర్కొన్నారు.
Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తిగా మారనుందని సీఎం అన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఎంత ముఖ్యమో, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత అవసరమో, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ కూడా అంతే కీలకమని వివరించారు. ఈ రంగంలో ముందంజలో ఉన్న దేశాలే భవిష్యత్తును శాసించే అవకాశముందని సీఎం అన్నారు.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!