MP Komatireddy: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఉపాధ్యాయుల కొరత ఉండేదని… త్వరలో భర్తీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని కేసీఆర్ చెప్పి మూడేళ్లు కావస్తున్నా… ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదన్నారు. కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోమటిరెడ్డి లేఖ ద్వారా సీఎంను అభ్యర్థించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోతుందని… ఎక్కడ పరీక్ష రాయకుండా అనర్హులుగా మిగిలిపోతారని లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Read also: Godavari Flood: గోదావరికి పెరుగుతున్న వరద.. 25.4 అడుగులకు చేరిన ప్రవాహం
ఇప్పటికే కొందరు లక్షలు ఖర్చు చేసి కోచింగ్ లు తీసుకున్నారని… మరికొందరు ఖాళీగా ఉంటూ ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారని ఎంపీ తెలిపారు. ఈసారి ఉద్యోగం వస్తుందన్న ఆశతో చదువుకుంటున్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని సీఎం కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. యుద్ధప్రాతిపదికన రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఉద్యోగాలు భర్తీ చేయకుండా అంధకారంగా మారుతోందని… వారి కుటుంబాలు కూడా చితికిపోతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు నెలలకోసారి టెట్, రెండేళ్లకోసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని… తెలంగాణలో ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ జరగడం లేదన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం అమర వీరులు ప్రాణత్యాగం చేశారా? ఈ కారణంగానే కొన్ని దశాబ్దాల పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!