కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఆర్థిక ప్రయోజనాలు అందించే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ స్కీమ్స్ పట్ల అవగాహన లేక బెనిఫిట్స్ ను పొందలేకపోతున్నారు. అలాంటి పథకాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. ఆ అద్భుతమైన పథకం ద్వారా కేవలం రూ. 20కే రూ. 2 లక్షలు పొందొచ్చు. చాలా తక్కువ ప్రీమియంతో ఆర్థిక భద్రతను అందించే బీమా పథకం. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. దేశంలోని ఏ పౌరుడైనా ఈ బీమా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ బీమాను కేవలం రెండు కప్పుల టీ లేదా 1 సిగరెట్ కు అయ్యే ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు. అంటే టీ, సిగరెట్స్ మానేయడం ద్వారా మిగిల్చే డబ్బుతో రూ. 20 ప్రీమియంతో బీమా పథకంలో చేరి రూ. 2 లక్షలు పొందే అవకాశం ఉంది.
Also Read:Vaani Kapoor : హాట్ ఫొటోస్ తో మదిలో వీణలు మోగిస్తున్న వాణి కపూర్
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించడం. ఈ పథకం ప్రమాదాలు బారిన పడినప్పుడు సహాయపడుతుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం సంవత్సరానికి రూ. 20. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద, మీరు సంవత్సరానికి కేవలం రూ. 20 చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల ప్రమాద బీమా కవర్ పొందవచ్చు.
Also Read:Free Gold-Saree Gift: బంగారం, చీర ఫ్రీ.. ఎందుకు, ఎక్కడో తెలుసా?
18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ యాన్యువల్ ప్రీమియం కేవలం రూ.20 మాత్రమే. అంటే ఇందులో మీరు సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు. అయితే ఈ పాలసీని ప్రతి సంవత్సరం కూడా రెన్యూవల్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బీమా డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన పాలసీదారు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యంతో మరణించినా వారి కుటుంబానికి రూ.2 లక్షల డబ్బుని చెల్లిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదంలో పాలసీదారు రెండు కళ్లు పోగొట్టుకున్నా కూడా వారి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
Also Read:SSMB 29 : కొత్త షెడ్యూల్ లొకేషన్ ఫిక్స్ !
రెండు చేతులు, రెండు కాళ్లు వైకల్యం కలిగి ఉన్నా కూడా బీమా కట్టిన వారి కుటుంబానికి పరిహారంగా రూ.2 లక్షల డబ్బుని ఇస్తారు. అలాగే బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో ఒక కాలు, చేయి లేదా ఒక కన్ను పోగొట్టుకుంటే రూ.1 లక్ష ఇస్తారు. ఇక ఈ ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన స్కీమ్ కి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.jansuraksha.gov.in/ని ఓపెన్ చేయాలి.
Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
ఇక ఆ తర్వాత మీరు ఫారమ్‌లపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేసి, తరువాత మీ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫారమ్‌లో అడిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇంకా దీనితో పాటు మీరు అందులో అడిగిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. ఈ స్కీమ్ కి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది.