Ravindra Jadeja: దయచేసి పుకార్లు పుట్టించకండి.. హగ్ చేసుకుంటే..?
- రిటైర్మెంట్ వార్తలపై రవీంద్ర జడేజా ఫైర్
- హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా?
- అనవసర వదంతులు వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు.
ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు సీనియర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురి వయసు 35 దాటేసింది. టీ20 ప్రపచకప్ 2024 గెలిచిన అనంతరం పొట్టి ఫార్మాట్‌కు అల్విదా పలికారు. వన్డే ప్రపంచకప్ 2027లో ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వీరు రిటైర్మెంట్ ప్రకటించచే అవకాశం ఉందని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. ఫైనల్లో జడేజా వ్యవహరించాడు. ఫైనల్లో తన 10 ఓవర్ల కోటా ముగిసిన వెంటనే కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దాంతో జడ్డు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వార్తలను జడేజా ఖండించాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ ఇస్తున్నట్లా అని ప్రశ్నించాడు?. ‘అనవసర వదంతులు వద్దు’ అని జడేజా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. స్టార్ ప్లేయర్‌పై రెండేళ్ల నిషేధం!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తనకు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం లేదన్నాడు. టీమిండియా మంచి స్థానంలో ఉన్నప్పుడే తాను వీడ్కోలు పలుకుతానని విరాట్ చెప్పాడు. దాంతో వన్డేల్లో ఈ ముగ్గురు మరికొన్నాళ్లు కొనసాగనున్నారు. ప్రపంచకప్ 2027 వరకు ముగ్గురు కొనసాగే అవకాశం ఉంది. మరో రెండేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?