NTV Telugu Site icon

Mamata Banerjee: బెంగాల్‌కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్‌కు ఎందుకు పంపలేదు?

West Bengal

West Bengal

Mamata Banerjee: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ ‘బేటీ బచావో’ పథకం ఇప్పుడు ‘బేటీ జలావో’ (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు. జాతి కలహాలు ఇప్పటివరకు 160 మందిని బలిగొన్న మణిపూర్‌కు కేంద్ర బృందాలను పంపేందుకు కేంద్రం ఎందుకు ఆలోచించలేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మణిపూర్‌కు సంఘీభావం తెలియజేసిన మమతాబెనర్జీ.. బీజేపీ బెంగాల్‌కు చాలా కేంద్ర బృందాలను పంపిందని, ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించింది.

Also Read: ED Raids: ఛత్తీస్‌గఢ్లో ఈడీ దాడులు.. కాంగ్రెస్ నేత, ఐఏఎస్ అధికారుల నివాసాలపై రైడ్స్

ఇక్కడ పార్టీ వార్షిక అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aకి ఆమె సంఘీభావం తెలిపారు. కాషాయ శిబిరాన్ని అధికారం నుంచి తొలగించడమే తమ ధ్యేయమని నొక్కి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యం పతనానికి సంకేతమని ఆమె హెచ్చరించారు. బీజేపీ గద్దె దించడమే తమ ధ్యేయమన్నారు టీఎంసీ బాస్ మమతా బెనర్జీ. 2024లో కేంద్రం నుంచి బీజేపీని గద్దె దింపడం తప్ప తమకు వేరే డిమాండ్ లేదన్నారు. తమకు ఏ కుర్చీ వద్దు అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఆశయాల వాదనలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు.

Also Read: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!

ఈ 26 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్ష కూటమి – I.N.D.I.A. అనే బ్యానర్‌తో తాము కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తామన్నారు. కూటమి పోరాడుతుందని, తృణమూల్‌ సైనికుడిలా అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.