DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యాన్ని (డీఏ) మూడు శాతం పాయింట్లు పెంచి ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 45 శాతానికి పెంచే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ పెరిగితే కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రయోజనం దక్కనుంది. అయితే డీఏను పెంచేందుకు.. లేటెస్ట్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుంటుంది.
Also Read: Gaddar: గద్దర్ మరణానికి కారణం ఇదే.. వైద్యులు ఏం చెప్పారంటే?
ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ ఈ డీఏ పెంపు గురించి చెప్పారు. తాము డియర్‌నెస్ అలవెన్స్‌లో నాలుగు పాయింట్లు పెంచాలని కోరుకుంటున్నా సాధ్యం కావట్లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే డీఏ 3 శాతం పెరిగి 45 శాతానికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుందని, ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ఆ ప్రతిపాదనను ఉంచుతుందని ఆయన వివరించారు.
Also Read: Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం
డీఏ పెంపు జూలై 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం, కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు.డీఏలో చివరి సవరణ మార్చి 24, 2023న జరిగింది. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. డిసెంబరు 2022తో ముగిసే కాలానికి అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా కేంద్రం నాలుగు శాతం పాయింట్ల మేర డీఏను 42 శాతానికి పెంచింది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. జీవన వ్యయం కొంత కాల వ్యవధిలో పెరుగుతుంది. అయితే సాధారణంగా ప్రతి ఏడాది కూడా డీఏ సవరణ రెండు సార్లు జరగాల్సి ఉంటుంది. ఇది జనవరి, జులైలో ఉంటుంది. అయితే ప్రతిసారి కాస్త ఆలస్యంగా అంటే మార్చి, సెప్టెంబర్ ఇలాంటి సమయాల్లో డీఏపై కేంద్రం ప్రకటన చేస్తూ వస్తోంది.