Central Minister Kishan Reddy Fired On Telangana CM Revanth Reddy: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శంబాలా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడిని తిట్టేందుకే అసెంబ్లీని సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని., ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, పాలన చేతకాక ప్రధాని మోడిని రెండు పార్టీలు (కాంగ్రెస్, బిఆర్ఎస్) విమర్శిస్తున్నాయి అని ఆయన అన్నారు. కేంద్రం పై నిప్పులు పోస్తున్నారు. పంచాయతీల్లో రహదారుల కోసం నిధులు ఇస్తే దారి మళ్ళించారని., రైల్వే వాగన్లు, ఇంజన్లు తయారీ సంస్థకు వరంగల్ లో ప్రధాని శంఖుస్థాపన చేస్తే, ఇంకా రైల్వే కోచ్ ఫాక్టరీ ఏదని అడగడం విడ్డూరంగా ఉందంటూ అన్నారు. తెలంగాణ లో 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 1208 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తయ్యేలా చేసింది. గతంలో కేసిఆర్ ఎలా వ్సవహరించారో, రేవంత్ రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారంటూ కాస్త గట్టిగానే స్పందించారు.
Union Budget: తమిళనాడులో బడ్జెట్ మంటలు.. డీఎంకే వర్సెస్ బీజేపీ..
తెలంగాణ లోని 60 లక్షల మంది రైతులకు నేరుగా సబ్సిడీలను కేంద్రం ఇస్తోంది. రేవంతి రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయలేకపోయున రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని ఆయన కోరారు. నేను ఏలాంటి హామీలను ప్రజలకు ఇవ్వలేదని.. ఒక లక్ష, 50 వేల కోట్ల రూపాయల మూసీ నది ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన అని.. దానికి కేంద్రానికి సంబంధంలేని ప్రాజెక్ట్ అని., ప్రజలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ను పదవిలో ఉండాలో, లేదో సికింద్రాబాద్ ఓటర్లు, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని., నేను ఎవరికీ బానిసను కానని.. నేను మొదట పట్టుకున్న జెండా, కమలం జెండా.. నా చివరి శ్వాస వరకు కమలం జెండానే పట్టుకుంటానని ఆయన అన్నారు. పదవుల కోసం, రాజకీయ అవసరాల కోసం జెండాలు, పార్టీలను మార్చను. గాంధీ కుటుంబానికి నీలాగా నేను ఎవరికీ బానిసను కాను. నేను ఈ దేశానికి బావిసను. సికింద్రాబాద్, తెలంగాణ ప్రజలకు మాత్రమే బావిసను. మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళాను అని సీఎం అంటున్నారు.. అంటే, రాగానే ఆయనకు చెక్కులు రాసివ్వాలా..! తెలంగాణ కు సైనిక స్కూల్ రాకపోవడానికి, కేంద్రం కారణమా..? రాష్ట్ర ప్రభుత్వం కారణమా..? సీఎం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.
Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..
కేవలం ఎనిమిది నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడతానని ఊహించలేదని., ఖచ్చితంగా ఆయన వైఫల్యం చెందడమే ఇలా మాట్లాడానికి కారణం అని., కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి సంయమనంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి కోసం కాదు..రాష్ట్ర ప్రజల కోసం… అమరావతికి డబ్బులిస్తే ఎందుకు అంత కడుపు మంట.. * ఏపి కి న్యాయం చేయడం కోసమే కేంద్రం సహాయం చేసింది.. తెలంగాణ లో రేపు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.. మేము కూడా సీఎంను అడుగుతాం,, అంటూ కిషన్ తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలకు విడివిడిగా ప్రతి జిల్లాకు ప్రాజెక్టులు ఇస్తారా…? మేమూ చూస్తాం.. అలా విడివిడిగా ఎక్కడా ఇవ్వరు.. అలా మాట్లాడడం మంచిది కాదు.. ” చచ్చుడో, నిధులు తెచ్చుడో ” అని సీఎం మాట్లాడడం ఏమిటి..? ఏం భాష..? అలా మాట్లాడవచ్చా..? అంటూ కేంద్రమంత్రి సీఎం పై ఆగ్రహించారు.