Bharath Rice: బియ్యం ధరలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక, రేపటి నుంచే మార్కెట్ లోకి బియ్యం వస్తుంది.. వీటికి భారత్ రైస్ గా కేంద్రం నామకరణం చేసింది. ఈ భారత్ రైస్ ను కిలో కేవలం 29 రూపాయలకే విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. దీని వల్ల సామన్య, మధ్య తరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా మోడీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
Read Also: Vijay Thalapathy : త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..పార్టీ పేరు పిక్స్?
అయితే, రేపటి నుంచి భారత్ రైస్ మార్కెట్ లోకి వస్తుంది. ఈ తరణంలో ఈ బియ్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ట్రై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకు వస్తుంది.