సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగూల కమలాకర్ అన్నారు. గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఇవాళ (గురువారం ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటి ఇచ్చారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.
Read Also: Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?
అయితే, ప్రజలు అయోమయానికి గురికావొద్దని మంత్రి గంగూల కమలాకర్ తెలిపారు. ఈ ప్రకటనలను ఎవరు ప్రచారం చేయొద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తరపు నుంచి కచ్చితంగా ప్రకటన ఇస్తామని, ప్రస్తుతం ఎలాంటి రేషన్ కార్డులు జారీ చేయడం లేదని మంత్రి అన్నారు. ఈ మేరకు ప్రజలు వాస్తవాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగూల సూచించారు.
Read Also: Ghulam Nabi Azad: హిందూ-ముస్లింలపై గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక, వచ్చే వారం నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు అనే ప్రచారం గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కొత్త రేషన్ కార్డుకు ఆప్లై చేసుకునేందుకు ప్రజలు మీసేవ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. దీంతో ఈ అసత్య ప్రచారానికి మంత్రి గంగూలా కమలాకర్ క్లారిటి ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిది గుడ్డిగా నమ్మొద్దని ఆయన సూచించారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుందని చెప్పుకొచ్చారు.