Basmati Rice: బాస్మతి రైస్ కు నాణ్యతా ప్రమాణాలు.. ఆగస్ట్ 1 నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు మంచి ఆకలి వేస్తోంది. ఏంచేస్తారు హాయిగా బిర్యానీ ఆర్డర్ చేస్తారు. ఆ బిర్యానీలో వాడే బాస్మతి బియ్యం గురించి మీకు తెలుసా? ఏ బియ్యం అంటే ఆ బియ్యం వాడితే బిర్యానీ రుచిగా ఉండదు. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది కేంద్రం. బాస్మతి బియ్యంతో వండే బిర్యానీ ఎంతో బాగుంటుంది. దేశంలో వివిధ రకాల బాస్మతి బియ్యం అందుబాటులో వున్నాయి. వివిధ కంపెనీలు, వివిధ రేట్లలో అమ్ముతారు. కల్తీలు, నాసిరకం బాస్మతి బియ్యంపై దృష్టి సారించింది కేంద్రం. బియ్యం పొడవు, ఈ బియ్యం నుంచి వచ్చే పరిమళం వంటి అంశాలతో నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది.
Read Also: Balakrishna: నారావారిపల్లెలో ఉదయాన్నే జాగింగ్ చేసిన బాలయ్య
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
హైదరాబాద్ లో బిర్యానీ రైస్ ఫ్యామస్. మంచి బిర్యానీ వండాలంటే బాస్మతి బియ్యం వెతికి తేవాల్సిందే. బిర్యానీకి బాస్మతి బియ్యంతో మరింత రుచి వస్తుందని అందరికీ తెలిసిందే. బాస్మతి బియ్యంలో ఈమధ్య కాలంలో బాగా కల్తీ జరుగుతోంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులకు మంచి బాస్మతీ బియ్యం అందించేందుకు వీలుగా ఈ నియంత్రణ ప్రమాణాలు రూపొందించినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్లకు, విదేశీ ఎగుమతులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఒరిజినల్ బాస్మతి రకాలుగా బ్రౌన్ బాస్మతి బియ్యం, మర పట్టించిన బాస్మతీ బియ్యం, మర పట్టించిన పారాబాయిల్డ్ బియ్యంను నోటిఫికేషన్లో వెల్లడించింది.
బాస్మతీ బియ్యానికి ఎలాంటి కృత్రిమ రంగులు, పాలిష్ పట్టినట్టు కనిపించేందుకు వాడే రసాయనాలు, కృత్రిమ పరిమళాలు వినియోగించరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దీంతో పాటు మరికొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. బాస్మతి బియ్యపు గింజ 7 మిమీ కంటే పొడవు ఉండాలని, వండిన తర్వాత అది సగటున 12 మిమీకి పెరగాలని పేర్కొంది. మర పట్టించిన బాస్మతీ బియ్యపు గింజ పొడవు 6.61 మిమీ ఉండాలని, ఉడికించిన తర్వాత 12 మిమీ కంటే పొడవు పెరగాలని నిర్దేశించింది. అంతేకాదు, బాస్మతి బియ్యంలో తేమ, అమైలోజ్, యూరిక్ యాసిడ్ శాతం, సగం విరిగిపోయిన బియ్యం, నాన్ బాస్మతీ రకాలు తదితర అంశాలను కూడా తాజా ప్రమాణాల్లో పొందుపరిచింది. కేంద్రం తీసుకువచ్చిన ప్రమాణాల ప్రకారం ఇకనుంచి విక్రయాలు జరపాల్సి వుంది. మరి వ్యాపారులు ఈ ప్రమాణాలు ఎలా పాటిస్తారో చూడాలి.
Read Also: Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!