NTV Telugu Site icon

Chandrababu Naidu’s Oath Taking Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. బెజవాడకు వీఐపీల క్యూ..

Babu 3

Babu 3

Chandrababu Naidu’s Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి. దీంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. నాల్గో సారి సీఎంగా చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానితో సహా ఢిల్లీ పెద్దలు.. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీఐపీలు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వీఐపీలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు.

Read Also: Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చిరు!!

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు.. ప్రముఖుల భద్రత మొదలుకుని.. పార్కింగ్.. వాహానాల దారి మళ్లింపు వంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. మొత్తంగా 20 ఎకరాల ప్రాంగణంలో స్టేజీకి.. ప్రముఖుల గ్యాలరీకి.. అలాగే మహిళలకు ఇలా ఎవరికి వారికి విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే జనం పెద్ద ఎత్తున తరలి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రజలు వస్తారనేది అంచనా. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా పవన్ కళ్యాణ్ తొలి సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అభిమానులు.. కార్యకర్తలు.. నేతలు పెద్ద ఎత్తున తరలి రావడం ఖాయంగా కన్పిస్తోంది. ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం అంతకు మించి జనం వస్తారనేది అంచనా. ఈ క్రమంలో దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

Read Also: Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..

ఇక సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత నేరుగా ఒడిషాకు వెళ్లి.. అక్కడ సాయంత్రం ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రధాని. ఇక అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి వారు రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది. చిరంజీవిని స్టేట్ గెస్టుగా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెగా ఫ్యామ్లీని గౌరవించింది. అలాగే రజనీ కాంత్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు.. మరికొందరు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నట్టు సమాచారం. అలాగే నారా, నందమూరి ఫ్యామీలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు.. ప్రమాణ స్వీకారం అనంతరం రేపు సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు చంద్రబాబు దంపతులు.. ఎల్లుండి తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు.