Chandrababu Naidu’s Oath Taking Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. బెజవాడకు వీఐపీల క్యూ..
- ఏపీ సీఎంగా రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
- నాల్గో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు
- టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలు
- వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వీఐపీలు
- సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి
- పెద్ద సంఖ్యలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వీఐపీల క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu’s Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి. దీంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. నాల్గో సారి సీఎంగా చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానితో సహా ఢిల్లీ పెద్దలు.. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీఐపీలు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వీఐపీలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు.
Read Also: Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చిరు!!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు.. ప్రముఖుల భద్రత మొదలుకుని.. పార్కింగ్.. వాహానాల దారి మళ్లింపు వంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. మొత్తంగా 20 ఎకరాల ప్రాంగణంలో స్టేజీకి.. ప్రముఖుల గ్యాలరీకి.. అలాగే మహిళలకు ఇలా ఎవరికి వారికి విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే జనం పెద్ద ఎత్తున తరలి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రజలు వస్తారనేది అంచనా. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా పవన్ కళ్యాణ్ తొలి సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అభిమానులు.. కార్యకర్తలు.. నేతలు పెద్ద ఎత్తున తరలి రావడం ఖాయంగా కన్పిస్తోంది. ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం అంతకు మించి జనం వస్తారనేది అంచనా. ఈ క్రమంలో దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.
Read Also: Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..
ఇక సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత నేరుగా ఒడిషాకు వెళ్లి.. అక్కడ సాయంత్రం ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రధాని. ఇక అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి వారు రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది. చిరంజీవిని స్టేట్ గెస్టుగా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెగా ఫ్యామ్లీని గౌరవించింది. అలాగే రజనీ కాంత్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు.. మరికొందరు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నట్టు సమాచారం. అలాగే నారా, నందమూరి ఫ్యామీలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు.. ప్రమాణ స్వీకారం అనంతరం రేపు సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు చంద్రబాబు దంపతులు.. ఎల్లుండి తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!