NTV Telugu Site icon

CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..

Cbi

Cbi

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.

READ MORE: Shashank Singh: అందుకే శ్రేయస్‌కు స్ట్రైక్ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పేసిన శశాంక్‌ సింగ్!

వాస్తవానికి.. భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణాలలో కొంతమంది అధికారులు దర్యాప్తు సంస్థల రాడార్‌లో కూడా ఉన్నారని సమాచారం. భూపేశ్ బాఘేల్ ఎక్స్‌ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ‘ ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ (AICC) సమావేశం కోసం ఏర్పాటు చేసిన “ముసాయిదా కమిటీ” భేటీకి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతకు ముందే, సీబీఐ రాయ్‌పూర్, భిలాయ్ నివాసాలకు చేరుకుని సోదాలు నిర్వహిస్తోంది.” అని రాసుకొచ్చారు.

READ MORE: Shashank Singh: అందుకే శ్రేయస్‌కు స్ట్రైక్ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పేసిన శశాంక్‌ సింగ్!

ఇటీవల, మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాఘేల్ నివాసంపై దాడి చేసింది. మార్చి 10న, లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో తన ఇంట్లోనే ఉన్న భూపేశ్ బాఘేల్ ఈడీ దాడికి సంబంధించి బీజేపీని విమర్శించారు. వాస్తవానికి.. రాష్ట్రంలో మద్యం కుంభకోణం 2019- 2022 మధ్య జరిగింది. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌ను బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలించింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, మద్యం సిండికేట్ లబ్ధిదారులు రూ.2,100 కోట్లకు పైగా దోచుకున్నారని కేంద్ర ఏజెన్సీ గతంలో పేర్కొంది.