ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.