ఐపీఎల్ 18వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ దీనికి ముందే, ఎంఎస్ ధోని లోపల ఉన్న ‘యానిమల్’ మేల్కొంది. అదేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఇటీవల ధోని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక ఫన్నీ యాడ్ చేశాడు, అందులో ధోనీ రణబీర్ కపూర్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఈ ప్రకటనలో ధోని – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి కనిపిస్తున్నారు. ఈ ప్రకటన ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ EMotorad కోసం షూట్ చేశారు. ఈ యాడ్ లో ధోని రణబీర్ రణవిజయ్ సింగ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
Manchu Manoj : అన్నని వదలని మనోజ్.. కన్నప్పకి పోటీగా దిగుతున్నాడు!
ఈ మొత్తం ఎలక్ట్రిక్ సైకిల్ యాడ్ లో, ధోని ‘యానిమల్’ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్ తన కారు నుంచి ప్రమాదకరమైన రీతిలో దిగి తన స్నేహితులతో కలిసి రోడ్డు దాటుతున్న దృశ్యం షూట్ చేశారు. కానీ తమాషా ఏమిటంటే ఈ ప్రకటనలో ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌తో రోడ్డు దాటుతున్నట్లు చూపించారు. ఇక ఈ యాడ్ లో వంగా, ధోనీ మధ్య సంభాషణ కూడా ఉంది. ఇక ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో తన 18వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ధోని త్వరలో తన జట్టు CSK తో మైదానంలోకి దిగబోతున్నాడు. వారి తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో జరగనుంది.