Odela2 : మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమాలో ఆమె శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచేశాయి. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. డి.మధు, సంపత్ నంది కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపత్ నంది మీడియాతో మాట్లాడారు. ఇందులో ఓదెల-3 కూడా ఉంటుందా అనే ప్రశ్న వేశారు రిపోర్టర్లు. దానికి క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు సంపత్ నంది. తాము రెండో పార్టు కోసం మొదటి పార్టులో లీడ్ ఇచ్చామని చెప్పారు.
Read Also : Amithabachan : ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి.. ఫ్యాన్స్ కు అమితాబ్ ప్రశ్న..
‘మొదటి పార్టు షూటింగ్ మధ్యలోనే మాకు సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే రెండో పార్టు కోసం లీడ్ ఇచ్చాం. ఇప్పుడు మూడో పార్టు కోసం మేం ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఏది చేయాలన్నా ఈ దేవుడే కోరుకుంటాడు అనిపిస్తుంది. ఒకవేళ దేవుడు కోరుకుంటే ఉంటుందేమో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఓదెల-2 హై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వస్తోంది. ఈ మూవీని ఓదెల గ్రామంలో నెలకొన్న సమస్యలను శివశక్తి పాత్రలో ఉండే తమన్నా ఎలా ఎదుర్కున్నది అనే కోణంలో తీస్తున్నారు. తమన్నా ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రలో నటిస్తోంది. ఇందులో హెబ్బా పటేల్, మురళీశర్మ కీలక పాత్రలు చేస్తున్నారు.