Singer Mano Sons: సింగర్ మనో కుమారులపై కేసు నమోదు.. గాలిస్తున్న చెన్నై పోలీసులు!
- మనో కుమారులపై కేసు
- పరారీలో రఫీ-షకీర్
- పోలీసుల అదుపులో మనో మేనేజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case registered against Singer Mano Sons in Chennai: ప్రముఖ సింగర్ మనో కుమారులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మనో కుమారులు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో మనో కుమారులు ఇద్దరు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మనో మేనేజర్, ఇంటి పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి ట్రైనింగ్ అయ్యాక అకాడమీ నుంచి బయటికి వచ్చి.. వలసరవాక్కంలోని ఓ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు మరో ముగ్గురు స్నేహితులు హోటల్లోనే ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు కృపాకరన్‌తో గొడవపడ్డారు. గొడవ ఎక్కువగా కావడంతో.. ఈ ఐదుగురు ఆ ఇద్దరిపై దాడి చేశారు. గాయపడిన కృపాకరన్‌ను స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
Also Read: IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్
కృపాకరన్ ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు సహా వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఐదుగురిలో ఇద్దరు అరెస్టు కాగా.. మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మనో మేనేజర్, ఇంటి పని మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!