Case Registered against Jabardasth Artist Nava Sandeep: ప్రముఖ బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనను మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి…
అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో నవ సందీప్ పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో ప్రతిరోజు వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్న సందీప్.. పెళ్లి చేసుకోమని యువతి అడగ్గా తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాదు ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో మోసాపోయానని తెలుసుకున్న యువతి తనకు న్యాయం చేయాలని మధురానగర్ పోలీస్ స్టేషన్లో సందీప్‌పై కేసు నమోదు చేసింది.
Also Read: World Cup 2023: బీసీసీఐకి షాక్ ఇచ్చిన హెచ్‌సీఏ.. ప్రపంచకప్ 2023 కొత్త షెడ్యూల్‌లో మార్పులు తప్పవా?
కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవ సందీప్ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది. పాటలతో పాటు కామెడీతో తనదైన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఇలా ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలిసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక జబర్దస్త్ షోతో పాటు పలు షోలలోనూ నవ సందీప్ కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలలోనూ అతడు పాల్గొన్నాడు. గతంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ జబర్దస్త్ హరిపై కూడా ఓ కేసు నమోదైంది.