Car sales October 2025 in India: అక్టోబర్ నెల ఆటో రంగానికి గొప్ప పురోగతి అనే చెప్పాలి. జీఎస్‌టీ మినహాయింపులు, పండుగ సీజన్‌తో అక్టోబర్ నెలలో వాహన అమ్మకాలు ఘననీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఎస్‌యూవీ టాటా నెక్సాన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంతలా అంటే.. ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్ నెలలో అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
జీఎస్‌టీ సంస్కరణ తర్వాత అన్ని ఎస్‌యూవీల ధరలు తగ్గాయి. హ్యుందాయ్ క్రెటా అక్టోబర్‌లో 18,381 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 17,497 యూనిట్ల కంటే 5 శాతం ఎక్కువ. క్రెటా బేస్ మోడల్ ధర రూ.10.73 లక్షలుగా ఉంది. మారుతికి చెందిన వ్యాగన్ఆర్ 18,970 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 13,922 యూనిట్లతో పోల్చితే 36 శాతం ఎక్కువ. వ్యాగన్ఆర్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు.
Also Read: ట్రిపుల్ 50MP కెమెరా, 7300mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్.. నవంబర్ 13న OnePlus 15 లాంచ్!
అక్టోబర్‌లో మారుతి ఎర్టిగా 20,087 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 18,785 యూనిట్లతో పోల్చితే 7 శాతం ఎక్కువ. ఎర్టిగా బేస్ మోడల్ ధర రూ.8.80 లక్షలు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 12,698 యూనిట్లతో పోల్చితే.. 64 శాతం పెరుగుదలతో 20,791 యూనిట్లతో డిజైర్ రెండవ స్థానంలో నిలిచింది. డిజైర్ ఆరంభ ధర రూ.6.26 లక్షలు. టాటా నెక్సాన్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ఎస్‌యూవీ మొత్తం 22,083 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అక్టోబర్‌లో అమ్ముడైన 14,759 యూనిట్ల కంటే 50 శాతం ఎక్కువ. నెక్సాన్ బేస్ మోడల్ ధర: రూ.7.32 లక్షలు.