Car Price Hike: కార్ లవర్స్ కు షాక్.. రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు
- రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు
- మారుతి నుంచి కియా వరకు పెరగనున్న ధరలు
- మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను 4 శాతం పెంచనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి తన కార్ల ధరలను పెంచడం మూడోసారి అవుతుంది. దీనికి ముందు జనవరి, ఫిబ్రవరిలలో కూడా ధరలు పెరిగాయి.
Also Read:Sanoj Mishra : మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
మారుతి తర్వాత దేశంలో అతిపెద్ద వాహనాల విక్రయ తయారీదారు హ్యుందాయ్ కూడా ఏప్రిల్ 2025 నుండి తన కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 2025 నుంచి మొత్తం పోర్ట్‌ఫోలియో ధర 3 శాతం వరకు పెరుగుతుంది. కియా కూడా ఏప్రిల్ 2025 నుంచి తన కార్ల ధరలను పెంచడానికి సన్నాహాలు చేసింది. ఏప్రిల్ 2025 నుంచి కియా కార్లపై 3% వరకు ధర పెరగనున్నది.రెనాల్ట్ కూడా ఏప్రిల్ 2025 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం పెంచనున్నట్లు తెలిపారు.
Also Read:UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..
జపాన్ ఆటోమేకర్ హోండా కార్స్ తో పాటు, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, మహీంద్రా కూడా ఏప్రిల్ 2025 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మహీంద్రా తన మోడళ్లపై మూడు శాతం ధర పెంచనున్నట్లు తెలిపింది. కానీ మిగతా రెండు తయారీదారులు తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన కార్ల ధరలను ఎంత పెంచుతారనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. లగ్జరీ వాహన తయారీ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచనున్నారు. BMW ధర మూడు శాతం పెరగనున్నది. ముడి సరుకుల ధరలు పెరగడం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాలు కార్ల ధరల పెంపుకు కారణమవుతున్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు.
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!