Sanoj Mishra : కుంభమేళా మోనాలిసా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన సనోజ్ మిహ్రాకు భారీ షాక్ తగిలింది. ఈయన మణిపూర్ ఫైల్స్ అనే సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన మీద తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా తనను లైంగికంగా వేధించాడని ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఢిల్లీలోని నబీ కరీమ్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. 2020లో టిక్ టాక్ ద్వారా ఆమెకు సనోజ్ మిశ్రా పరిచయం అయ్యాడంట.
Read Also : Vijay Sethupathi: పూరీతో సేతుపతి.. పాపం తమిళ తంబీలు!!
‘టిక్ టాక్ ద్వారా మా ఇద్దరి పరిచయం పెరిగింది. 2021 జూన్ 17న నాకు సనోజ్ మిశ్రా కాల్ చేశాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలన్నాడు. కానీ నేను వెళ్లలేదు. చనిపోతాను అని బెదిరించడంతో చివరకు వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాత నన్ను హోటల్ రూమ్ కు తీసుకెళ్లి నాకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు బయటపెడుతానంటూ బెదిరించాడు. అలా బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు’ అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సనోజ్ మిశ్రా అరెస్ట్ తో మోనాలిసా పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. దీనిపై మోనాలిసా ఇంకా స్పందించలేదు.