RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నాడు రామ్. అందుకే ఈ సారి తానె స్వయంగా మెగా ఫోన్ పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. రామ్ కెరీర్లో 23వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జూన్ 29న అనగా ఈ సోమవారం ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
“ది లోన్ వోల్ఫ్ అవేకెన్స్” అంటూ మేకర్స్ వదిలిన ఈ అప్డేట్ రామ్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది. ఈ సినిమాకు స్వయంగా రామే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా బాధ్యతను భుజాన వేసుకుని ఈ భారీ సినిమాను తెరకెక్కించబోతున్నాడు రామ్. రామ్ అన్న కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా నిర్మించనున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీయస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా శ్రీనిధి శెట్టి పేరు పరిశీలినలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!