Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
- రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ
- సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
- ప్రజా రవాణాలో ప్రయాణించే వారి బాధ్యతపై మరోసారి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా ‘సివిక్ సెన్స్’ (పౌర బాధ్యత)పై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ తన సీటు చుట్టూ పల్లికాయ పొట్టు వంటి ఆహార వ్యర్థాలను కోచ్ లోనే పడేసి, సీటు పక్కనే వాటర్ బాటిల్‌తో చేతులు కడుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. రైలు కోచ్‌లోని డెడికేటెడ్ వాష్ ఏరియా ఉన్నప్పటికీ ఆమె అలా చేయడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురైంది.
రైలు కోచ్ డోర్ దగ్గర సీటు ఉన్నా, ఆమె లేచి వాష్ బేసిన్ వద్దకు వెళ్లకపోవడం గమనార్హం. ఇది ఏ రైలు, ఏ రూట్ అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ వీడియో X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వ్యాపించి, లక్షలాది వ్యూస్ సాధించింది. ఈ వైరల్ వీడియో మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. పరిశుభ్రత అనేది కేవలం ప్రచార కార్యక్రమాలతోనే కాదు, ప్రతి వ్యక్తి రోజువారీ అలవాట్లతోనే సాధ్యమవుతుంది.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మళ్లీ తెరపైకి వచ్చిన ‘సివిక్ సెన్స్’ చర్చ
ఈ ఘటనతో ప్రజా రవాణాలో ప్రయాణించే వారి బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది. రైళ్లు, మెట్రోలు, బస్సులు వంటి ప్రజా ప్రదేశాల్లో చెత్త వేయడం, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కూడా రైళ్లలో చెత్త పేరుకుపోవడం, ప్రయాణికులు కోచ్‌లను అపరిశుభ్రంగా మార్చడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో చర్చ
ఈ వీడియోపై కొందరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుండగా, మరికొందరు ప్రజల్లో సివిక్ సెన్స్ పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఆస్తులను కాపాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బేసిక్ సివిక్ సెన్స్ లేమిగా విమర్శించారు. “డర్టీ ట్రైన్స్ ఎప్పుడూ గవర్నమెంట్ తప్పు కాదు, పీపుల్ బ్లేమ్ కూడా ఉంది” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
రైల్వేలు, బస్సులు, పార్కులు వంటి ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత. ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, టిష్యూ పేపర్లు, ఆహార ప్యాకెట్లు వంటి చెత్తను డస్ట్‌బిన్‌లో వేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, ఇతరులకు కూడా మంచి సందేశాన్ని ఇవ్వవచ్చు. ప్రతి ప్రయాణీకుడి చిన్న చిన్న చర్యలే రైలు ప్రయాణాలను మరింత ఆహ్లాదకరంగా, శుభ్రంగా చేస్తాయి.
భారతీయ రైల్వేలు స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, ప్రయాణీకుల నుంచి సహకారం లేకపోవడం ఒక పెద్ద సవాల్. ఇంతకు ముందు కూడా రైలు కోచ్‌లలో చెత్త విసరడం, విండో బయటకు విసరడం వంటి ఘటనలు వైరల్ అయ్యాయి. ఇటీవలి ఘటనల్లో రైల్వే సిబ్బంది కూడా చెత్త బయటకు విసరడం వీడియోలు వచ్చాయి.
What an uncouth behaviour !!!!
We need mass education on civic sense in public places.pic.twitter.com/EzSbKVYnUE— Rishi Bagree (@rishibagree) June 27, 2026
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!